ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మానవత్వం చాటుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహానం ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్ ఆపించారు.
అనంతరం కారు దిగి బాధితుల దగ్గరకు వెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు.హుటాహుటిన వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. గమనించిన స్థానికులు హోంమంత్రి చర్యలపై ప్రశంసలు కురిపించారు. కాగా, బాధితురాలికి వేగంగా వైద్య సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.