హైదరాబాద్ మేయర్ మార్పు? ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. 11వ తేదీ తర్వాత ఎప్పుడయినా అవిశ్వాసం పెట్టె అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత పార్టీలో కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని సమాచారం అందుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/10/Case-registered-against-GHMC-Mayor-Gadwala-Vijayalakshmi.webp)
తమ పార్టీ నుంచి గెలిచి మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే కాంగ్రెస్ కి విజయలక్ష్మి వెళ్లడం పై బిఆర్ఎస్ పార్టీ నేతలు గరంగరం అవుతున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని మార్చాలని వేచిచూస్తున్న బిఆర్ఎస్.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. 11 తేదీ తరవాత ఎప్పుడయినా అవిశ్వాస తీర్మానం పెట్టుకునేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
విజయలక్ష్మి కాకుండా ఎవరికయినా మద్దత్తు ఇస్తామని ఇప్పటికే నిర్ణయిం తీసుకున్నాయట బీజేపీ, ఎంఐఎం పార్టీలు. తమ, తమ కార్పొరేటర్లతో చర్చించనున్న కేటీఆర్, కిషన్ రెడ్డి… 11వ తేదీ తర్వాత ఎప్పుడయినా అవిశ్వాసం పెట్టె అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.