పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి అని.. ఆయన మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలని తెలిపారు. పవన్ కళ్యాణ్ తోలు తీస్తానంటున్నారు.. తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా లేరని ఫైర్ అయ్యారు. ఆయన రెండు స్థానాల్లో నిలబడితే ప్రజలు ఆయన్ని రెండు చోట్ల తిరస్కరించారని.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని చోట్ల నిలబడతారో… ప్రజలు ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చురకలు అంటించారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కు వచ్చిన ఒకటి,రెండు సీట్లు కలుపుకొని రెండు పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయని అక్కడే అర్థమైపోతుందని.. ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందని.. ఒకసారి లెఫ్టిస్టు అంటాడు.. మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు ఇంకోసారి టిడిపితో వెళ్తాడని ఎద్దేవా చేశారు.పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని.. తమ పాలన ఎలా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. అధికారంలోకి రావాలంటే పార్టీ విధి విధానాన్ని ప్రజలకు చెప్పాలని చురకలు అంటించారు.