హుజూరాబాద్ బైపోల్ కోసం టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ బీజేపీ పార్టీ, ఈటెల రాజేందర్ పై విమర్మలు గుప్పించారు. నియెజకవర్గంలోని ఉప్పల్ లో ముస్లీముల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ పాలనలో ముస్లీంలకు రక్షణ లేదని.. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ముస్లీంలు అందరు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. కేంద్రం గ్యాస్,
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందని.. ప్రస్తుతం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తడి చేస్తుందని విమర్శంచారు. షాదీ ముబారక్ వంటి గొప్ప పథకం ద్వారా ముస్లీం ఆడబిడ్డలకు కేసీఆర్ అండగా ఉంటున్నారని వెల్లడించారు. లౌకికవాదిగా చెప్పుకునే ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారని.. తన కారుపై తానే రాళ్లదాడి చేయించుకుని విషప్రచారం ద్వారా సానుభూతి సంపాదించేలా చూస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.