చర్మ సౌందర్యానికి అమ్మాయిలు చాలా తిప్పలు పడుతారు. కొందరు పార్లర్స్ మీద ఆధారపడితే.. మరికొందరు ఇంట్లో ఉండే వాటితోనే చాలా టిప్స్ ఫాలో అవుతారు. ఎంతైనా.. నాచురల్ గా చేసుకునేవే రిజల్ట్ లేట్ అయినా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. ఇంట్లో దొరికే.. బియ్యం పిండి చర్మ సౌందర్యానికి కీలకమైనది.. బియ్యపు పిండితో న్యాచురల్ స్కిన్ టోన్ ను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.
బియ్యపు పిండితో చర్మానికి ఉపయోగాలు:
బియ్యపు పిండి, ఎగ్ వైట్, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల స్కిన్ టైట్‌గా ఉంటుంది. ముడతలు ఉండవు.
బియ్యం పిండి, ఓట్ మీల్, పాలపొడి మిశ్రమాలను కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని స్కిన్ టోన్‌గా ఉపయోగించుకుంటే చర్మం అందంగా మారుతుంది.
కంటి కింద ఏర్పడే వలయాలు. ఇది అయితే అందిరికి కామన్ గా ఉండే సమస్య.. బాగా పండిన అరటి పండు, ఆముదం, బియ్యం పిండి కలిపి ప్యాక్‌లా రాసుకుంటే డార్క్ సర్కిల్స్ మటుమాయమవుతాయి.
బియ్యం పిండి, ఆలోవెరా జెల్, తేనె కలిపి పేస్టుగా చేసుకుని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, ముఖం మీద ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.
ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి.. అర టీస్పూన్ టమోటా జ్యూస్‌ను పేస్టులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. ఇలా రోజూ చేయడం ద్వారా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని ముఖానికి తాజాదనాన్ని ఇస్తుంది.
బియ్యం పిండి, అలో వెరా జెల్, తేనె కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. నలుపుదనం కూడా తగ్గిపోతుంది.
బియ్యం పిండి, పెరుగు, యాపిల్ జ్యూస్, ఆరంజ్ జ్యూస్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇది డార్క్ స్పాట్స్ తొలగించి, నిర్జీవంగా మారిన చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
బియ్యం పిండి, శనగపిండి, తేనె, పంచదార, కొబ్బరినూనె కలుపుకోవాలి. దీన్ని స్ర్కబ్ లా ఉపయోగిస్తే.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి చర్మం సాఫ్ట్గ్ గా మారుతుంది.