తెలంగాణ రైతులకు షాక్‌..భారీగా పడిపోయిన పసుపు ధర !

-

తెలంగాణ రైతులకు షాక్‌ తగిలింది. పసుపు ధర భారీగా పడిపోయింది. పసుపు బోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారు కానీ గత ఏడాది ధరలు కూడా పలకడం లేదని ఆందోళనలో రైతులు ఉన్నారు. గతంలో ఒక క్వింటాలు ధర రూ.17 వేల నుండి రూ.18 వేలు వచ్చేది, ఇప్పుడు కేవలం రూ.7 వేలు మాత్రమే వస్తుందని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పసుపు బోర్డు వచ్చాక మంచి లాభాలు ఉంటాయని అదనంగా 10 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు రైతులు.

The price of turmeric has fallen drastically

జగిత్యాల జిల్లాలో పసుపు సాగు ఎక్కువగా ఉండగా, పంటను అమ్ముకునేందుకు మెట్ పల్లి, జగిత్యాల, నిజామాబాద్ మార్కెట్లకు పసుపు తరలించే రైతులు… పసుపు నిల్వ చేసే మార్గం లేకపోవడంతో నష్టం వచ్చినా కూడా ప్రైవేటు సంస్థలకు అమ్ముతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రావట్లేదని, పసుపు బోర్డు ఇప్పటికైనా రంగంలోకి దిగి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version