ప్రేమలో ఉన్నాం.. పెళ్లికి అనుమతివ్వండి.. సుప్రీంలో ఇద్దరు అబ్బాయిల పిటిషన్‌

-

ఈ మధ్య స్వలింగ జంటల వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడు తల్లిదండ్రులు, సమాజ పోకడలకు భయపడి తమలో తామే కుంగిపోయిన జంటలు ఇప్పుడు ధైర్యంగా ముందుకొస్తున్నాయి. వారి హక్కుల కోసం పోరాడుతున్నాయి. చివర వరకూ పోరాడుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. వారి హక్కులను వారు సాధించుకుంటున్నాయి. అలాంటి ఓ జంట తమ పెళ్లికి అనుమతించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరి వీళ్ల కథేంటో చూద్దామా..?

తాము గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని.. తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది ఓ స్వలింగ సంపర్క జంట. ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరారు. వారితో పాటు మరో ముగ్గురు తమ పెళ్లిలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేయగా.. వీటన్నింటినీ మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.  ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్‌ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్‌ నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version