బింబిసారా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న కళ్యాణ్ రామ్.. సక్సెస్ అవుతారా..?

-

కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత బింబిసారా సినిమాతో తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అవ్వడమే కాదు కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం అదే జోష్ తో ఆయన నటిస్తున్న మరొక చిత్రం అమిగోస్. ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నారు కళ్యాణ్ రామ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నిన్న విడుదల చేయగా ఇందులో కళ్యాణ్ రామ్ విలన్, హీరో, కూల్ గా ఉండే మూడు షేడ్స్ లో మనకు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

“నో రిలేషన్.. నో బ్రదర్ .. లుక్ లైక్ ఓన్లీ “అంటూ కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బింబిసారా సినిమా సెంటిమెంట్ ని కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రానికి కూడా ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకెళితే ఫిబ్రవరి 10వ తేదీన అమిగోస్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 5వ తేదీన ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం ఆలోచిస్తుంది. అందుకే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరు కాబోతున్నారు అనే విషయాన్నికొస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.

ఇదివరకే బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాగా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కళ్యాణ్ రామ్ ఫాలో అవుతూ తన అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు మరి ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version