రెండు దేశాలను ఒకేసారి కవర్ చేసిన బెడ్.. హనీమూన్ కు బెస్ట్..

-

రెండు దేశాల సరిహద్దులను కలుపుతూ కొన్ని ప్రాంతాలు ఉంటాయి.అక్కడ కొన్ని హోటల్స్ , హనీమూన్ స్పాట్ లు బాగా ఫెమస్ అవుతాయి.అవి కొంతమందికి కొత్త థ్రిల్ ను ఇస్తుంది.అలాంటి కొన్ని దేశాలలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లు ఉన్నాయి.లా క్యూర్ అనే ఈ గ్రామం స్విట్జర్లాండ్లో ఒకప్పుడు వుండేది. ఆ తర్వాత ఫ్రాన్స్ ఈ ఊరిని స్వాధీనం చేసుకోవాలని అనుకుంది.

కుదరకపోవడంతో స్విట్జర్లాండ్ కి వేరే ప్రాంతం ఇచ్చి, ఈ ఊరిలో సగం, ఫ్రాన్స్ తీసుకుంది. అలా రెండు దేశాల సరిహద్దును ఈ ఊరు కలుపుతుంది. ఓ వ్యక్తి రెండు దేశాల్లో సగం సగం ఉండేలా ఓ ఇంటిని నిర్మించాడు. ఆ ఇంటిని అమ్మెసాడు. కొద్ది రోజులు తర్వాత దానిని హోటల్ గా మార్చారు.

ఆర్బేజ్ హోటల్ గా పేరు పెట్టారు. ఈ హోటల్ సగం ఫ్రాన్స్, సగం స్విట్జర్లాండ్ లో ఉండటంతో బాగా పేరొచ్చింది. ఈ హోటల్ లో కొన్ని రూమ్స్ కూడా సగం ఫ్రాన్స్, సగం స్విట్జర్లాండ్ లో ఉంటాయి..దాంతో ఆ హోటల్ బాగా ఫెమస్ అయ్యింది.ఇకపోతే ఈ హోటల్ కి మరింత ఫేమ్ తీసుకురావడానికి, ఓ రూమ్ లో రెండు దేశాల్లో ఉండేలాగా ఓ బెడ్ ని వేసి ఒకేసారి రెండు దేశాల్లో హనీమూన్ చేసుకోవచ్చు అని ఆఫర్ పెట్టారు. దానితో పాటుగా ఆ బెడ్ మీద ఉన్న దిండులకు రెండు దేశాల జెండాలను ఉంచారు.

ఈ హోటల్ లో బెడ్ మాత్రమే కాదు చాలా వింతలు ఉన్నాయి. రెండు దేశాలలో ఫెమస్ ఫుడ్, మరెన్నో అక్కడ ఉన్నాయని అంటున్నారు.బార్ ఫ్రాన్స్ లో ఉంటే దాని ఎంట్రన్స్ డోర్‌ మాత్రం స్విట్జర్లాండ్‌లో ఉంది. బిల్డింగ్‌లోని మెట్లలో సగం ఒక దేశంలో ఉంటే మిగిలిన సగం ఇంకో దేశంలో ఉన్నాయి.

32ఒక రూంలో అయితే గది మొత్తం స్విట్జర్లాండ్‌లో ఉంటే బాత్‌రూమ్ ఫ్రాన్స్‌లో ఉంది.. మొత్తానికి ఆ హోటల్ కొత్త జంటలకు స్పెషల్ ఫ్యాకెజి లను ఇస్తూ వస్తుంది.దీంతో ఎక్కువ మంది అక్కడకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. మీరు ఎప్పుడైనా అక్కడకు వెళితే మీరు వెళ్ళండి..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version