ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. డైరెక్టర్ తో పాటు పిల్లలు సజీవదహనం

-

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాలో విజయదశమి పర్వదినాన విషాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు సజీవదహనమయ్యారు. వారంతా నిద్రిస్తుండగా ప్రమాదం జరగడంతో నిద్రలోనే కాలి బూడిదయ్యారు.

ఆగ్రాలో జిగ్నేర్​ రోడ్డులో ఉన్న మధురాజ్​ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులకు, ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఆస్పత్రికి వద్దకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో చిక్కుకున్న రోగులు, సిబ్బందిని అధికారులు రక్షించారు. రోగులను వేరే ఆస్పత్రిలో చేర్పించారు.

బిల్డింగ్​ రెండో అంతస్తులో ఆస్పత్రి డైరెక్టర్​ రాజన్​ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. మంటలు ఎగిసిపడిన సమయంలో అతడి కుటుంబం నిద్రిస్తోంది. పొగలు విపరీతంగా అలుముకోవడం వల్ల రాజన్​ కుటుంబసభ్యులు బయటకు రాలేకపోయారు. దీంతో రాజన్​, ఆయన కుమారుడు, కుమార్తె మంటల్లో సజీవదహన మయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version