దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్‌గేట్స్ – మెలిందా దంపతులు గతేడాది విడాకులు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేతలుగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించిన ఈ జంట బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు. తాజాగా ఆమె ఫార్చ్యూన్ మేగజైన్‌తో తన విడాకులపై మాట్లాడారు.
‘వివాహ బంధంలో ఇక ఏమాత్రం ఇమడ లేకపోవడానికి నాకు కొన్నికారణాలున్నాయి. అయితే కొవిడ్‌కు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నాకు కావాల్సింది నేను చేసేందుకు తగినంత గోప్యతనిచ్చింది. విడాకుల విషయంలో నేను నమ్మశక్యంకానీ తీవ్రమైన వేదనను అనుభవించాను. అయితే ఆ బాధను దాటుకొని రావడానికి నాకు గోప్యత ఉండేది. నేను విడిపోయిన వ్యక్తితోనే తరచూ పనిచేస్తుండేదాన్ని. ఉదయం తొమ్మిదింటి సమయంలో నేను ఏడుస్తూ ఉంటే.. పదింటికల్లా ఆ కన్నీరు తుడుచుకొని ఆ వ్యక్తితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేదాన్ని. నేను మెరుగ్గా కనిపించాలనుకున్నాను’ అని మెలిందా వెల్లడించారు.
‘గత రెండు సంవత్సరాల్లో నా జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నా దృష్టిలో మాది గొప్ప వివాహం. జరిగిన దానిని నేను మార్చలేను. నేను వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అవకాశం వస్తే.. మెలిందానే మళ్లీ వివాహం చేసుకుంటా’ అని తన విడాకుల గురించ గతంలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.