లాక్ డౌన్ వలన నష్టపోయిన రంగాల్లో హోటల్ రంగం కూడా ఉంది. ఒకరంగా ఇప్పటికీ ఈ హోటల్స్ లో జనాలు ఫుల్ అవ్వడం లేదు. అయితే లాక్‌డౌన్ తర్వాత హోటల్స్ మీద జనాలకు మళ్ళీ పాత మోజు తేవాలనే ఉద్దేశ్యంతో చెన్నైలో ఓ హోటల్ యజమాని వినూత్న ఐడియాతో ముందుకు వచ్చాడు. అలా పది రూపాయలకే బిర్యానీ అమ్మడం మొదలు పెట్టాడు. తమిళనాడులోని అరుప్పుకొట్టైలో మొన్న ఆదివారం నాడు బిర్యానీ హోటల్‌ను ప్రారంభించిన జహీర్ తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు కేవలం 10 రూపాయలకే బిర్యానీ అమ్ముతామని ప్రకటించాడు.
దీంతో బిర్యానీ కోసం జనం బారులు తీరారు. ఫలితంగా తోపులాట ప్రారంభమై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అసలు లాక్ డౌన్ ఉద్దేశం కరోనా కట్టడి అయితే ఆ కరోన నిబంధనల్నే గాలికి వదిలేశారు. అలా బిర్యాని కోసం వచ్చిన వాళ్లలో చాలా మంది మాస్కులు కూడా పెట్టుకోకపోవడంతో పోలీసులు హోటల్ యాజమానిపై చర్యలు తీసుకున్నారు. అతనిపై, 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని జహీర్ ను హెచ్చరించి వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేశారు.