వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే అంతా మంచే కలుగుతుంది. ఏమైనా సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఇంట్లో సమస్యలు ఉండవు. ఈ విధంగా అనుసరిస్తే ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. అలానే ధనలాభం కూడా కలుగుతుంది. అయితే మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న వాస్తు చిట్కాల గురించి చూద్దాం.
డ్రాయింగ్ రూమ్:
డ్రాయింగ్ రూమ్ ఇంట్లో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడే కూర్చుంటారు. ముఖ్యంగా గోడల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. డ్రాయింగ్ రూమ్ లో బ్రౌన్ కలర్, పింక్, తెలుపు లేదా క్రీమ్ కలర్ వేస్తే మంచిది. గలేబులు మరియు కర్టెన్లు కూడా అదే రంగుని ఉపయోగిస్తే మంచిది.
డైనింగ్ రూమ్:
ఇక డైనింగ్ రూమ్ విషయం లోకి వస్తే… ఇక్కడ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. అందుకని డైనింగ్ రూమ్ లో నీలం, లైట్ గ్రీన్ లేదా పింక్ రంగుల్ని వాడితే మంచిది. ఇది తాజాదనాన్ని తీసుకు వస్తుంది.
వంట గది:
వంట గది లో కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా ముఖ్యం. వంటగదిలో తెలుపు రంగు వేస్తే మంచిది.
బెడ్ రూమ్:
బెడ్రూంలో మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. లైట్ గ్రీన్, నీలం లేదా పింక్ రంగులని బెడ్రూంలో వేసుకుంటే మంచిది. ఇలా ఈ వాస్తు చిట్కాలను అనుసరిస్తే ఖచ్చితంగా మంచి కలుగుతుంది అలానే సమస్యలు లేకుండా ఉండొచ్చు.