దసరా వచ్చిందంటే అందరికీ జమ్మిపూజ.. అదేనండి జమ్మికి వెళ్లడం అక్కడ ఆ చెట్టును ఆరాధించండం. అసలు శమీ పూజ ఎలా చేయాలి దానివలన లాభాలు తెలుసుకుందాం…
శమీపూజ దగ్గర చదవాల్సిన శ్లోకం
‘‘శమీ శమతే పాపం
శమీ శతృ వినాశనం
అర్జున్యస ధనుర్ధారి,
రామస్య ప్రియదర్శనం’’
అనే శ్లోకంతో శమీచెట్టును ఆరాధించాలి. అక్కడ తెల్లపేపర్ పై మీకోరికలను, లేదా పేరు, గోత్రం రాసి ఆ చెట్టు దగ్గర పెట్టి రావడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా వస్తుంది. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని పూజించాలి.ఇలా జమ్మిచెట్టు దగ్గర పూజ, గ్రామం పొలిమేరలు దాటి అందరూ రావడం, కొన్ని ప్రాంతాలలో పాలపిట్టను చూడటం వంటివి కూడా ఆచారంగా ఉన్నాయి. అక్కడ అందరూ ఆ చెట్టు ఆకులను ప్రసాదంగా/బంగారంగా భావించి దుర్గాదేవిని ఆరాధించి సకల విజయాలు, శుభాలు కలగాలని ప్రార్థన చేస్తారు.అలాయ్బలాయ్ తీసుకుంటారు.
– శ్రీ