అధికమాసం.. ఈ ఏడాది ఆశ్వీయుజ మాసం వచ్చింది. దీంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహిస్తున్నారు. అయితే అసలు అధికమాసం ఏమిటి దీన్ని ఎలా నిర్ణయిస్తారు….
ఏ చాంద్రమాన మాసంలో రవి వేరొక రాశియందు ప్రవేశించడం జరుగదో – దానిని అధిక మాసము అని భావిస్తారు. ఈ సంవత్సరాన్ని చూసినట్లయితే తేలికగా చెప్పాలంటే సౌర మాసం ఆదీ అంతముల మధ్యన సంభవించే చాంద్ర మాసం – అధిక మాసం.
దీన్నికచ్చితంగా శాస్త్రీయంగా చెప్పాలంటే .. భూమికి – సూర్యుడి చుట్టూ తిరగడానికి 365+ రోజుల సమయం పడుతుంది. సూర్య సిద్ధాంతపరంగా సరిగ్గా చెప్పాలంటే 365.258756 (365 రోజుల 6 గంటల 12 నిమిషాల 36+ సెకండ్లు). ఇది నాక్షత్రిక గణనము (Sidereal duration). నేటి ఆధునిక శాస్త్రీయ లెక్కలను బట్టి 365.256362 (365 రోజుల 6 గంటల 9 నిమిషాల 8+ సెకండ్లు) సమయం పడుతుంది. సూర్య సిద్ధాంత పరంగా మరియూ నేటి ఆధునిక శాస్త్రపరంగాగానీ, రమారమిగా 29.53 రోజుల్లో చంద్రుడు భూమి చుట్టూ తిరగుతాడు (Synodic month). ఈ మాసాన్ని రెండు పక్షాలుగా; ఒక్కో పక్షం 15 తిథుల కిందా విభాగింపబడింది. ఒక్కో తిథి కనిష్టంగా 21+ గంటల నుండి గరిష్టంగా 26+ గంటల వ్యవధి కలిగి ఉండవచ్చు. ఈ లెక్కన 354+ రోజుల్లో పన్నెండు మాసాలు పూర్తి అవుతాయి. ఇలా తగ్గిన రోజులను సరిపోయేలా చేయడానికి గణించి మూడేండ్లకొకసారి అధికమాసాన్ని ఏర్పాటుచేస్తారు.
– శ్రీ