వామ్మో, వాట్సాప్ ని ఎన్ని వందల కోట్ల మంది డౌన్లోడ్ చేసారో తెలుసా…?

-

వాట్సాప్, ఈ రోజుల్లో ఇది లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు అనేది వాస్తవం. ఏదైనా సాంకేతిక సమస్య వచ్చి ఆగిపోతే వ్యాపారాలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రోజు రోజుకి మన జీవితంలో దీని వాడకం అనేది క్రమంగా పెరుగుతూ పోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ వాట్సాప్ అనేది నేడుకీలక పాత్ర పోషించే పరిస్థితి.

ప్రపంచ వ్యాప్తంగా దీనిని భారీగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఫేస్బుక్ యాజమాన్యంలో పని చేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించింది. గూగుల్ ప్లేలో ఫేస్‌బుక్ తర్వాత 500 కోట్ల డౌన్‌లోడ్స్ పొందిన రెండవ నాన్-గూగుల్ యాప్‌గా వాట్సప్ నిలిచింది. ఆండ్రాయిడ్ వెర్షన్‌లో ఇంత పెద్ద మొత్తంలో డౌన్‌లోడ్స్ పొందిన యాప్‌లలో ఫేస్‌బుక్ యాజనమాన్యానికి చెందిన,

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లు ఉన్నాయి. వాట్సప్‌కు నెలకు సగటున 106 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారట. దాని తర్వాత ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు 103 కోట్ల మంది, వీచాట్‌కు 101 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని అంతర్జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ఇటీవల వాట్సాప్ భద్రతా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version