‘మా’ ఎలక్షన్స్ గురించి మీకు తెలిసింది ఎంత..!

-

‘మా’ ఎలక్షన్స్ రోజురోజుకు ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి..సాధరణ ఎన్నికలను తలపించేలా నటీనటుల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఐదుగురు బరిలోకి దిగారు. అధ్యక్ష పోటీకి నవ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. అయితే మనలో చాలామందికి ఈ ఎన్నికలపై సరిగా అవగాహన ఉండకపోవచ్చు..అసలు అధ్యక్షుడిని, కార్యవర్గ సభ్యులను ఎలా ఎన్నుకుంటారు? అసోసియేషనల్లో ఉన్న ఒక్కో సభ్యుడు ఎన్ని ఓట్లు వేయాలి? అగ్రహీరోలు తప్ప మిగిలిన వారెందుకు మా ఎన్నికల్లో ఓటింగ్ కు దూరంగా ఉంటారు?  కార్యవర్గం కర్తవ్యం ఏంటి? ఇలాంటి వాటి గురించే మనం ఈరోజు తెలసుకుందాం..!
రెండుసంవత్సరాలకోసారి మూవి ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం మారుతూ ఉంటుంది. ఈ కార్యవర్గంలో మొత్తం 26మంది మెంబర్లు ఉంటారు. ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు 18మంది ఈసీ మెంబర్లు ఉంటారు. వీళ్లను ఓటుహక్కు ద్వారా నటీనటులు ఎన్నుకుంటారు.

  ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుందంటే..!

 మూవి ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఓటింగ్ విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం 26మంది కార్యవర్గ సభ్యులను ఓటర్లు ఎన్నుకుంటారు. ఓటర్లు పోటి పడుతున్న ప్యానెల్ సభ్యులు తమకు నచ్చిన అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, ట్రేజరర్ , జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఈసీ సభ్యులకు ఓటు వేయాలి. అంటే ఒక్కో ఓటరు 26ఓట్లు వేయాలనమాట.! అయితే ఓటింగ్ ప్రక్రియలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధి ఏ ప్యానల్  లో ఉన్నాడు, ఏ పదివికి పోటీ చేస్తున్నాడో చూసి ఓటి వేయాల్సి ఉంటది. కేవలం రెండు ప్యానెల్స్ మధ్య పోటీ జరిగితే ఓటర్ కు ఎలాంటి గందరగోళం ఉండదు. కాని ఇప్పుడు ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష పదవికి ఐదుగురు పోటీపడుతున్నారు.

 అధ్యక్షుడు గెలిచినట్లు ఎలా నిర్ణయిస్తారు..?

మనం ముందుగా అనుకున్నట్లుగా మా అసోసియేషన్ లో ఒక్కో ఓటరు 26ఓట్లను వేయాలి. పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడికైనా, ఈసీ సభ్యుడికైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే.. ఎన్నికల్లో 2 వేరు వేరు ప్యానెల్స్​​లో ఉండి పోటీ చేసిన అభ్యర్థులు గెలిచాక ఒక ప్యానెల్​గా మారుతారు. అధ్యక్షుడిగా గెలిచిన వ్యక్తి తన ఆధ్వర్యంలో మిగితా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది. దాంతో పూర్తిగా ఒకే ప్యానెల్ విజయం సాధించడానికి ఈ ఎన్నికల్లో ఆస్కారం లేదు. ఈ క్రమంలోనే ప్యానెల్ సభ్యుల మధ్య విబేధాలు, మాటకు మాట పెరిగి తరుచూ మా అసోసియేషన్ వివాదాస్పదంగా మారుతోంది.
2015లో  రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య జరిగిన పోటీలో రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  2017లో ఏకగ్రీవం అయింది. 783సభ్యులు శివాజీరాజాను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2019-2021ఎన్నికలు తారాస్థాయికి చేరాయి. శివాజీరాజా- నరేష్ లు అధ్యక్ష పోటీకీ తలపడ్డారు. అప్పట్లో అసోసియేషన్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో 69ఓట్లతో శివరాజ్ పై నరేష్ విజయంసాధించారు.
ఆరేళ్లుగా మార్చిలోనే ఎన్నికలు నిర్వహించిన అసోసియేషన్..కొన్ని అంతర్గత సమస్యలు, కరోనా కారణంగా తొలుత సెప్టెంబర్ కు మార్చింది. తాజాగా అక్టోబర్ 10కి డేట్ ను ఖరారు చేసారు. ఎన్నికలకు ఇంకా 3 నెలలు సమయం వున్నపటినుచే  చిత్రపరిశ్రమలో ఎన్నికల నజారా మొదలైంది. ప్రస్తుతం మా అసోసియేషన్ లో అధికారిక లెక్కల ప్రకరాం చూసుకుంటే 914 మంది సభ్యులుండగా వారిలో కొంత మంది చనిపోయారు. కొత్తగా 87మందికి సభ్యత్వం వచ్చింది.
పెద్ద సంఖ్యలో సభ్యులన్న మా అసోసియేషన్లో ఓటింగ్ శాతం మాత్రం తక్కువనే చెప్పాలి. 2015లో చూసుకుంటే కేవలం 394 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2019లో అగ్రహీరోలు వచ్చి ఓటు వేయటంతో ఓటింగ్ శాతం కాస్త పెరిగిందనే చెప్పాలి. ఈసారి కూడా ఓటింగ్ శాతం పెంచాలనే అనుకుంటున్నారు.

మెంబర్ షిప్ పొందటానికి లక్షా..!

నరేష్ తన కాలపరిమితలో 87 మంది నటీనటులకు కొత్తగా మెంబర్ షిప్ ఇచ్చారు. సభ్యుల సంఖ్యను పెంచేందుకు  సభత్వ రుసుములో డిస్కౌంట్ కూడా ప్రకిటించారు. లక్ష రూపాయలున్న సభ్యత్వ ఫీజును అప్పటికప్పుడు చెల్లిస్తే 10వేలు రాయితీ ఇచ్చారు. అలాగే ఈ ఫీజును ఒకేసారి కాకుండా నాలుగు విడతలుగా కట్టే అవకాశం కల్పించారు. కానీ చిన్ననటీనటులు, పేదకళాకారులు అంత పెద్దమొత్తంలో ఫీజును చెల్లించలేక ఎన్నికలకు దూరమవుతున్నారని అప్పట్లో నాగాబాబు వ్యాఖ్యానించటం చర్చనియాంశంగా మారింది.

  మా అసోసియేన్ లో గెలిస్తే ఏం చేయాల్సి ఉంటుంది..

గెలిచిన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులంతా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యం కోసం పనిచేయాల్సి ఉంటుంది. సభ్యుల పింఛన్లు, హెల్త్ ఇన్యూరెన్స్ లతో పాటు సభ్యుడు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి రావాల్సిన జీవిత బీమా సొమ్మును దగ్గరుండి ఇప్పించాలి. అంతేకాదు..ప్రభుత్వం నుంచి సభ్యులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయే లేదో చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది సభ్యులకు సినిమాలో అవకాశాలు కల్పించటం కూడా కార్యవర్గ ముఖ్యకర్తవ్యం.
వీటన్నింటితో పాటు..సినీపరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించటం, ఇతర భాష నటీనటుల సంఘాలతో విబేధాలు రాకుండా చూసుకోవటం కూడా అసోసియేషన్ కార్యవర్గం బాధ్యతే. అసోసియేషన్ కు నిధులు సమీకరించేందుకు వివిధ రకాల కమిటీను ఏర్పాటు చేసి  వాటిలో ఉండే సభ్యులంతా వారి వారి బాధ్యతలను వివాదాలు రాకుండా రెండుసంవత్సరాలపాటు కొనసాగించాలి. తాజాగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యుల పేర్లను వెల్లడించారు.
ఇదండి మా అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ..రోజుకో మలుపు తిరుగూ సాగుతున్న ఈ ఎన్నికల బరిలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version