రసాయనిక ఎరువులతో దిగుబడి పెరగడం మాట పక్కన పెడితే పంట కెమికల్స్ తో నిండిపోతుంది.ఇలా చెయ్యడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడి తగ్గుతూ, మద్దతు ధర కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి ఇబ్బందుల నుంచి విముక్తి కోసమే యువ రైతులు వినూత్నంగా ఆలోచించాడు..
రైతులు సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారు. రసాయనాల వాడకంతో భూసారం కోల్పోయి దిగుబడులు తగ్గిపోతున్నాయని భావించిన నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామానికి చెందిన వెలుగు అనూక్ అనే యువ రైతు సేంద్రియ పంటల వైపు దృష్టి సారించాడు..సేంద్రియ సాగులో మంచి లాభం ఉండడంతో ఆ పంటల కోసం ఆవు పేడ, గో మూత్రంతో జీవామృతాన్ని తయారు చేయడం మొదలెట్టాడు. ఒక్కొ పంటకు ఐదు సార్లు జీవామృతాన్ని అందిస్తారు.
అందుకు కావాల్సి న రెండు దేశవాళీ ఆవులను కొనుగోలు చేశాడు.ఉన్న పొలంలో ఒక్కో ఎకరాలో ఒక్కో పంట వేశాడు.అలా బెండ, గోరుచిక్కుడు, టమాట, మొక్కజొన్నలు ఇతర కూరగాయల సాగు చేస్తున్నాడు యువరైతు అనూక్. నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ రైతు సేంద్రియ పద్దతిలో గో ఆధారిత సాగు చేస్తూ లాభాలు గడించడంపై సాటి రైతులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు..కొన్ని మెలుకువలు పాటించి వ్యవసాయం చెయ్యడం మంచిది..వేర్వేరు పంటలు వేస్తూ..ఒక్కో పంట దిగుబడి దానిపై వస్తున్న రాబడి చూసుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నాడు..ఈ విషయాన్ని ప్రతి రైతు గుర్తుంచుకోవాలి..