మీ ఇంట్లో వారు ఎలాంటి జ్వరాలతో బాధపడుతున్నారో తెలుసుకోవడం ఎలా..?

-

జ్వరం..సీజన్ మార్పువల్ల ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా జ్వరంతో బాధపడుతున్నారు.కొన్ని కుటుంబాలలో ఇంటిల్లిపాధి జ్వరాల బారిన పడుతున్నారు.

మలేరియా, డెంగీ, ఫ్లూ అనే రోగాల మొదటి లక్షణం జ్వరమే అయినా.. వాటిలో చిన్న పాటి తేడాలు మాత్రం ఉంటాయి. వాటిని గమనిస్తూ దానికి తగ్గట్లుగా చికిత్స అందిస్తే మలేరియా, ఫ్లూ, డెంగీ రోగాల నుండి బయట పడవచ్చు. అయితే వాటిలక్షణాల మధ్య తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డెంగీ:
వర్షాకాలం ప్రారంభం కాగానే డెంగీ చాలా మందిని చుట్టుముడుతుంది. ఈడిస్ జాతి దోమలు కుట్టడం ద్వారా డెంగీ వస్తుంది.ఇది సోకగానే రక్తంలో ప్లేట్ లెట్స్, బీపీ పడిపోతాయి.ఒళ్ళు నొప్పులు, నిశ్శత్తువ, చర్మం పై మచ్చలు రావడం, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మలేరియా:
ఇది అంటువ్యాధి,దోమల నుండి వ్యాప్తి చెందుతుంది.అందుకే ఇంట్లో ఒకరికి మలేరియా వస్తే ఇంటిల్లిపాది దాని బారిన పడతారు.చిన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు వస్తాయి. మలేరియా ముదిరితే కామెర్లు, రక్త హీనత సమస్యలు చుట్టుముడతాయి.దీని వల్ల హిమోగ్లోబిన్ కిడ్నీల ద్వారా బయటకు వస్తుంది. మలేరియా వచ్చినప్పుడు మూత్రం నల్లగా వస్తుంది.

కరోనా :
కరోనా వైరస్ పై పోరాడేందుకు టీకాలు ఉన్నప్పటికీ… కరోనా సోకితే మాత్రం దీనికంటూ మందులు లేవు . లక్షణాలను బట్టి మందులు వాడటమే. జ్వరం ఉంటే పారాసిటమాల్ వాడాలి. జలుబు, ముక్కు దిబ్బడ ఉంటే గోరు వెచ్చటి నీటిని తాగడం, తరచూ ఆవిరి పట్టుకోవడం చేయాలి. సమస్య తీవ్రమైతే వైద్యుల ను సంప్రదించాలి.

ఫ్లూ జ్వరం :
ఫ్లూ వైరస్ సోకినప్పుడు జ్వరం 101డిగ్రీలకన్నా ఎక్కువవస్తుంది. కొందరిలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, పొడి దగ్గు కూడా ఉండొచ్చు. కొందరిలో శ్వాస సరిగ్గా ఆడదు. మరికొందరిలో అలసట, నిస్సత్తువ, ముక్కు కారటం వాంతులు, విరేచనాలు లక్షణాలు కన్పిస్తాయి.ఇది రోగనిరోధక శక్తిని నాశనం చేస్తాయి.

టైఫాయిడ్ :
టైఫాయిడ్ కలుషితం నీరు, ఆహారంలో ఉన్న బ్యాక్టిరియా వల్ల వ్యాప్తి చెందుతుంది.
టైఫాయిడ్ వస్తే 103 నుండి 104 వరకు కూడా జ్వరం వస్తుంది. విరేచనాలు, ఆకలి లేకపోవడం, వాంతులు, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version