కాకరకాయ అనే మాట వింటేనే చాలు, చాలామంది అమ్మో చేదు అని అంటుంటారు. కానీ కాకరకాయలో ఎవ్వరికి తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కాకరకాయ ఎన్నో వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకరకాయ, బెల్లం కలిపి కూర వండుకుంటే ఆ రేచే వేరు. అంతే కాదు శరీరంలో ఉన్న మలబద్ధకాన్ని కూడా కాకరకాయ తొలగిస్తోంది.
కాకరకాయ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఈ రసాన్ని కీళ్ళ నొప్పులు ఉన్న చోట మనం మర్ధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాకరకాయను అనేక రకాలుగా వండుకోవచ్చు. కూరలాగ, పులుసులాగ, కారం లాగా, ఫ్రై లాగా, పకోడి లాగా,చిప్స్ లాగా మరెన్నో రకాలు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కాకరకాయ మసాలాకారం ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సినవి :
కాకరకాయలు-1/2 kg – ఎండు కొబ్బరి ముక్కలు – వెల్లుల్లి రెమ్మలు – పల్లీలు – ధనియాలు – జిలకర్ర 2 టేబుల్ స్పూన్స్ – ఉప్పు – కారం – తాలింపు దినుసులు 2 టేబుల్ స్పూన్స్ – కరివేపాకు – పసుపు – ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా కావాలి.
ఎలా తయారు చేయాలంటే…
కాకరకాయల పై చెక్కు తీసి లోపల గింజలు తీసేని కొద్దిగ ఉప్పు, పసుపు వేస్తే కాకరలో చేదు పోతుంది. ఆ తర్వాత మసాలా కారం రెడీ చేసుకోవాలి. ధనియాలు,జిలకర్ర,ఎండు కొబ్బరి,పల్లీలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జారులో వేసి కొద్దిగ కారం, వెల్లులి రెమ్మలు వేసుకొని గ్రైండ్‌లో మిక్సీ చేసుకోవాలి.
పైన ఉన్న కాకరకాయలోని నీళ్లను పిండాలి. ఆ తర్వాత ఆయిల్ కాస్త వేడి చేసి కట్ చేసిన కాకరకాయలు వేయించుకోవాలి. అప్పుడు మసాలాకారం ఈ కాకరమిశ్రమం మిక్స్ చేయాలి. ఈ రెండు మిశ్రమాలను మిక్స్ చేసి కాసేపు మిక్సీలో పెట్టి ఒక నిమిషం తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అదే నోరూరించే కాకర మసాలా కారం స్టఫ్ అవుతుంది.