సండే స్పెషల్ ;ఎంతో రుచికరమైన చేపలు, గోంగూర కర్రీ…!

-

ఆదివారం రాగానే అందరి దృష్టి మాంసాహారం పైకి వెళుతుంది. కాని ఎప్పుడు చికెన్ ఫ్రై, మటన్ కర్రీ లు మాత్రమే కాక ఇలా గోంగూర కాంబినేషన్ లో చేపల కూర చేసుకోండి. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే గోంగూర లో కూడా కావలసినన్ని పోషకాలు ఉన్నాయి. ఇక ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ కి టెస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ చేతుల్లోనే. మరి ఈ కర్రీ ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 300 గ్రాములు శుభ్రం చేసి పెట్టుకోవాలి. కారం 2 స్పూన్లు, పసుపు ¼ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గోంగూర 200 గ్రాములు, నిమ్మకాయ 1, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, పచ్చి మిర్చి 4, గరం మసాలా ½ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ 4 స్పూన్లు, జీలకర్ర ¼ స్పూన్.

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసుకున్న చేప ముక్కలు తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం ఒక స్పూన్ వేసి బాగా కలపి ఒక అరగంట పక్కన పెట్టాలి.తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక చేప ముక్కలను రెండు పక్కలా వేయించాలి. వేగిన చేప ముక్కలను వేరే ప్లేట్ తీసుకుని మిగిలిన ఆయిల్ లో జీల కర్ర వేసి వేగిన తర్వాత ఉల్లి, పచ్చి మిర్చి వేసి వేయించాలి. అవి కూడా వేగాక గోంగూర వేసి వేయించాలి. మొత్తం అన్ని మగ్గాక ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి వేయించి, ముందుగా వేయించిన చేప ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కరివేపాకు, కొత్తిమీర వాసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చేపలు, గోంగూర కర్రీ రెడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version