టేస్టీ తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలి అంటే …!

-

మన దేశంలో సంప్రదాయ వంటలకు పెట్టింది పేరు. అది కూడా ఒక్కో పండగకు ఒక్కో వంట చేస్తారు. అయితే మన ఆంధ్రా రుచులు మరి స్పెషల్ గా ఉంటాయి. పెళ్లిళ్లకు ఒక వెరైటీ, ఫంక్షన్లకు ఒకటి, ఇలా ఒక్కో శుభకార్యానికి ఒక్కో వెరైటీ వంటలు చేస్తారు. వాటిల్లో ఒకటి తొక్కుడు లడ్డు. దీన్నే బేసిన్ లడ్డు, బందర్ లడ్డు అని అంటారు.

కావలసిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 2 కప్పులు, యాలకుల పొడి1 స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీఫ్రై కి సరిపడా, పుచ్చ గింజలు కొద్దిగా, నెయ్యి 1 స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు.

తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని శనగ పిండి, ఉప్పు, లైట్ గా ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి జంతికల పిండిలా కలుపుకోవాలి. దీన్ని జంతికలలాగా కాగిన నూనె లో ఒత్తుకోవాలి. ఇవి వేగే లోగా పక్కన వేరే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పంచదారలో కాసిన్ని నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి. వేగుతున్న జంతికలను రెండు వైపులా మరీ వేగకుండానే తీసివేయాలి. ఆ జంతికలు ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సిలో వేసి మెత్తని పిండిలా మిక్సి పట్టాలి. ఆ పిండిని పంచదార పాకంలో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పాలి. ఆ మిశ్రమం దగ్గరగా అయ్యే వరకు తిప్పి దానిలో నెయ్యి, పుచ్చ గింజలు వేసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంతే తొక్కుడు లడ్డు రెడీ.

దీనిలో పోషక విలువలు: కేలరీస్ 185, కార్బోహైడ్రేట్స్ 14 g, ఫాట్ 53 g, ప్రోటీన్ 4 g, సోడియం 2,250 g, కొలెస్ట్రాల్ 295g.

Read more RELATED
Recommended to you

Exit mobile version