ఇక‌పై సాయం చేస్తూ ‌సెల్ఫీలు దిగితే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు

-

గ‌త డిసెంబ‌ర్ చివ‌రి‌లో చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఈ క్ర‌మంలోనే వేల మంది ప్రాణాల‌నూ బ‌లి తీసుకుంది. ఇక ఈ మ‌హ‌మ్మారి బాధితులు ల‌క్ష‌ల్లో ఉన్నారంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. భార‌త్‌లో కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైలు, విమానాలతో పాటు ఇతర వాహనాల వాడకం కూడా తగ్గిపోయింది.

అంతేకాక, ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. భార‌త్‌లోనే కాకుండా కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.. 30కి పైగా దేశాల్లో ఆంక్షలు విధించారు. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేకం. ముఖ్యంగా రోజు వారి కూలీలు, వలస వెళ్లిన వారు నిత్యవసరాల విషయంలో, ఆహార విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా కష్ట కాలంలో పేదలకు ఆహారం అందజేయడంలో పలు స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకు వ‌స్తున్నాయి.

ఉచితంగా నిత్యవసర సరకులతో పాటు.. ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో మెజార్టీ సేవకులు స్వీకరిస్తున్న వారితో కలిసి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌‌ చేస్తున్నారు. దీంతో వారేదో యాచిస్తున్నారా.. అవసరానికి తీసుకుంటున్నారా అంటూ పలువురు నెటిజన్ల తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజస్థాన్‌లోని అజ్మీర్‌ కలెక్టర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అందులో భాగంగా ఎవరైనా సరే.. సహాయం చేస్తూ బాధితులతో కలిసి సెల్ఫీ తీసుకోవద్ద‌ని.. ఒక‌వేళ తీసుకుంటే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామ‌ని ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version