పొట్ట తగ్గడానికి తినకుండా ఉంటే సరిపోదు.. ఏవి తినాలో తెలుసుకోవాలి.

-

కాలు కదపకుండా పనులన్నీ జరిగిపోవాలని అందరూ అనుకుంటారు. ఏ పనైనా క్షణాల్లో అయిపోవాలని తపిస్తుంటాం. ఎక్కడో కూర్చుని మరెక్కడి నుండో పనులు చేసుకుంటుంటాం. అంతా ఆన్ లైన్ అయిన ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దాని ఫలితమే ఊబకాయం, పొట్ట మొదలగు ఇబ్బందులు వస్తుంటాయి. సాధారణంగా కొంచెం పొట్ట వస్తున్నట్టు కనిపించగానే తెగ ఇబ్బందిపడిపోయి తినడమే మానేస్తారు. కానీ అది సరైన పద్దతి కాదు.

 

శారీరక శ్రమ లేకుండా ఆఫీసుల్లో కూర్చుని కూర్చుని పొట్టల్ని ముందుకు తెస్తున్న వారందరూ అన్నం తినడం మానేస్తే పొట్ట్ అదే తగ్గుతుందని అనుకుంటారు. అన్నం తినడం మానేస్తారు కరెక్టే మరి ఏం తీసుకోవాలి. పని చేయడానికి శక్తి కావాలి. అది కూర్చుని చేసేదైనా సరే. ఏమీ తినకుండా ఉంటే శక్తి నశించి నీరసం ఆవరిస్తుంది. అలా కాకుండా ఏది తింటే పొట్ట తగ్గుతుందో తెలుసుకోవాలి.

ముందుగా గుడ్లు..

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లని తీసుకుంటూ ఉంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. అందుకే పెద్దలంటారు రోజుకి ఒక గుడ్డు తినాలి అని.

సిట్రస్ ఫలాలు.

సిట్రల్ ఫలాలైన బత్తాయి, నారింజ, నిమ్మ మొదలగు వాటిని తీసుకోవడం వల్ల అందులో పొటాషియం పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఆపిల్..

ఆపిల్ లో ఉండే ఉర్సోలిక్ ఆమ్లం కొవ్వు కరిగేలా చేస్తుంది. రోజూ ఒక ఆపిల్ తినమని చెప్పేది అందుకేనేమో..

ఓట్స్..

ఓట్స్ లో బీటా గ్లూకాగాన్ అనే ఒకరకమైన ఫైబర్ ఉంటుంది. దీని వల్ల శరీరంలో చెక్కెర శాతం తగ్గుతుంది. గ్లూకోజ్ లెవెల్స్ ని సరిగ్గ ఉంచడంలో ఓట్స్ బాగా ఉపయోగపడతాయి. రోజూ ఒక పూట భోజనసమయాల్లో ఓట్స్ తీసుకుంటే కొన్ని రోజుల్లో కనిపిమ్చే మార్పు మీకే అర్థం అవుతుంది.

ఇంకా ఆహారంలో పసుపు సరిగ్గా తీసుకోవాలి. ఉల్లి గడ్డ కూడా చాలా మంచిది. అరటి పండ్లు, రేగు పండ్లు, టమాట మొదలగు వాటిని తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా సులభంగా తగ్గిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version