ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్ కట్ కాకుండా ఉండాలంటే.. బ్యాంకుకు వెళ్లే బదులు మీరు పోస్టాఫీసు శాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు టీడీఎస్ ఉండదు. 5 ఏళ్ల టర్మ్ డిపాజిట్లలో జమ చేస్తే డిపాజిటర్లు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మంచి రిటర్నులు కావాలంటే ఉత్తమమైన మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇటీవల కాలంలో చాలా మంది ఔత్సాహికులు వీటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులు అందించే పెట్టుబడి మార్గంలో నిర్ణీత వడ్డీరేటు, నిర్ణీత కాలానికి వర్తిస్తుంది. పొదుపు ఖాతా కంటే అధిక వడ్డీరేట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అందుకోవచ్చు. అయితే ఈ సమయంలో వీటికి పూర్తిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొత్తం ఆదాయానికి సంబంధించిన స్లాబ్ రేట్లపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సెక్షన్ 80సీ కింద పొందుపరిచిన విధంగా పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఇది 1.5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది.
ఎఫ్‌డీ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. మీ ఆదాయం సంబంధించిన స్లాబ్ రేట్లపై పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయాన్ని మీ ఖాతాకు జమ చేసినందున బ్యాంకు ఈ పన్నును తీసివేస్తుంది. మీకు మూడేళ్లఎఫ్‌డీ ఉంటే ప్రతి ఏడాది చివర్లో టీడీఎస్ ను మినహాయిస్తుంది. ఆదాయపుపన్ను శాఖ మీ మొత్తం పన్నుకు టీడీఎస్ ను లెక్కిస్తుంది. టీడీఎస్ నిలిపివేయనప్పటికీ మీ మొత్తం ఆదాయంలో వడ్డీ రాబడిని చేరిస్తే దానిపై పన్ను చెల్లించాలి. ఎఫ్డీ కాలపరిమితి పూర్తయే లోపు మీరు తిరిగి తీసుకుంటే మీ మొత్తం వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. అంతేకాకుండా అదనపు ట్యాక్స్ చెల్లించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది 26ఏఎస్ ఫారం ఆధారంగా మీ ఆదాయాల నుంచి టీడీఎస్ ల గురించి తెలుసుకోవచ్చు. ఏదైనా పన్నుల చెల్లించాల్సి ఉంటే మీరు దాన్ని ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు అంటే మార్చి 31లోపు సమర్పించాలి.
మీకు ఉన్న అన్ని ఎఫ్డీల నుంచి వచ్చే మొత్తం వడ్డీ రాబడి ఏడాదికి రూ.40000 కంటే తక్కువ ఉంటే ఎలాంటి టీడీఎస్ ఉండదు. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వృద్ధులకు రూ.50 వేల వరకు మినహాయింపు వర్తిస్తుంది.
- ఈ రాబడి 40 వేలకంటే మించి ఉంటే 10 శాతం టీడీఎస్ చెల్లించాలి. మీ పాన్ నెంబరును బ్యాంకుకు సమర్పించకపోతే వారు మీ డిపాజిట్ నుంచి 20 శాతం టీడీఎస్ ను తీసివేస్తారు.
- మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు టీడీఎస్ తీసివేయరు.
- బ్యాంకులు టీడీఎస్ ను తీసివేయకుండా చూసుకోవడానికి ఉత్తమ ప్రత్యామ్నాయం 15జీ ఫారం, 15హెచ్ ఫారాన్ని మీ సంబంధిత బ్యాంకుకు సమర్పించాలి.
- ఫిక్సెడ్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, ఇతర డిపాజిట్ల నుంచి పొందే వడ్డీ ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ.50 వేల పరిమితి వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
పన్ను ఆదా చేసుకోవాలంటే మీరు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. ఓ వ్యక్తి పాత లేదా ప్రస్తుతమున్న ట్యాక్స్ పద్దతిని ఎంచుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను–పొదుపు స్థిర డిపాజిట్లలో పాల్గొనడం ద్వారా మీరు ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందవచ్చు.
5 సంవత్సరాల లాక్–ఇన్ వ్యవధి ఉన్న ఈ డిపాజిట్లపై అకాల ఉపసంహరణలు అనుమతించబడవు.
స్వల్పకాలిక రుణం పొందడానికి ఇది వేగవంతమైన, సరళమైన మార్గం. అనవసరంగా ఎఫ్‌డీ ఉపసంహరించుకునే బదులు డిపాజిటర్లు రుణం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి ఖాతా విషయంలో, అయితే పన్ను ప్రయోజనం మొదటి ఖాతాదారుడికి మాత్రమే లభిస్తుంది.
ఆన్ లైన్ లో ఎలా ఫైల్ చేయాలి?
నెట్ బ్యాంకింగ్ ద్వారా 15జీ/హెచ్ ను ఆన్ లైన్ లో ఫైల్ చేయడానికి మీ బ్యాంకు మిమ్మల్ని అనుమతిస్తే ఈ విధంగా చేయవచ్చు.
- మీ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ పోర్టల్ కు వెళ్లి మీ ఖాతా వివరాల ద్వారా లాగిన్ అవ్వండి.
- ట్యాక్స్ సెక్షన్ వద్ద ఫారం 15జీ/15హెచ్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఫారంలో తగిన వివరాలను పొందుపరిచి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
- ఎక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ డౌన్ లోడ్ చేసుకొని సర్వీస్ రిక్వెస్ట్ నంబరును నోట్ చేసుకోవాలి.