Manchu Manoj: మంచు విష్ణు కు మనోజ్ సవాల్ విసిరారు. మంచు విష్ణు వర్సెస్ మనోజ్ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఈ తరుణంలోనే… సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు కు మనోజ్ సవాల్ విసిరారు. భార్యలను ,నాన్నను పక్కకు పెట్టి.. చూసుకుందాం రా అంటూ ఛాలెంజ్ చేశారు మనోజ్.
కాసేపు భార్యలను ,నాన్నను పక్కన పెడదాం.. మన ఇద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం… అంటూ మంచు విష్ణు కు మనోజ్ సవాల్ విసిరారు. ఇక నిన్న ” సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ” అనే డైలాగ్ ని షేర్ చేశారు విష్ణు. అయితే ఈ డైలాగుని ఉద్దేశించి మంచు మనోజ్ తాజాగా ఓ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు లాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు” అంటూ విష్ణు కి కౌంటర్ ఇచ్చే విధంగా ట్వీట్ చేశారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#VisMith u r too cute… let’s sit and talk, Man to Man. keeping women, Dad, staff and sugar out of this. What say ?!
Man up #VisMith 🙏🏼🙌🏽❤️ I promise I will come alone, u can get whomever you want or we can have an open and healthy debate 🙌🏽❤️
Yours, #CurrentTheega 😅 pic.twitter.com/9diTq9HYzA
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2025