వాహ‌న‌దారుల‌కు షాక్‌.. అక్టోబర్‌ 1 నుంచి పాత వాహనాలకు ఆర్టీఏ సేవల చార్జిలు భారీగా వసూలు..

-

మీరు ఢిల్లీలో నివాసం ఉంటున్నారా ? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వెహికిల్‌ స్క్రాపింగ్‌ పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అవి ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. అవి అమలులోకి వస్తే పాత వాహనాలకు సంబంధించి అనేక సేవలకు గాను వాహనదారులు పెద్ద ఎత్తున రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

15 ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న ప్రైవేటు వాహనాలు, 20 ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న వాణిజ్య వాహనాలకు గాను వాహనదారులు అక్టోబర్‌ 1వ తేదీలోగా స్క్రాప్‌ సర్టిఫికెట్‌ను పొందాలి. దీంతో వాహన ఆర్‌సీ రెన్యువల్‌పై చార్జిలను విధించరు. అలా చేయకపోతే ఆర్‌సీ రెన్యువల్‌, ఫిట్‌నెస్‌ టెస్ట్‌ వంటి సేవలకు భారీగా చార్జిలను వసూలు చేస్తారు.

ఇక టూ వీలర్లకు కొత్త ఆర్‌సీకి రూ.300, రెన్యువల్‌కు రూ.1000, త్రీ వీలర్‌, క్వాడ్రి సైకిల్‌కు కొత్త ఆర్‌సీకి రూ.600, రెన్యువల్‌కు రూ.2500, లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌కు అయితే కొత్త ఆర్‌సీకి రూ.600, రెన్యువల్‌కు రూ.5వేలు వసూలు చేస్తారు. ఇంపోర్టెడ్‌ వెహికిల్‌ అయితే కొత్త ఆర్‌సీ ఫీజు రూ.2500, రెన్యువల్‌కు రూ.10వేలు వసూలు చేస్తారు. ఇక ఆర్‌సీ స్మార్ట్‌ కార్డు కనుక మరో రూ.200 అదనంగా చెల్లించాలి. ఆర్‌సీ రెన్యువల్‌ ఆలస్యం అయితే నెలకు అదనంగా మరో రూ.300 ఫీజు వసూలు చేస్తారు. దీంతోపాటు మరో రూ.500 అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే పాత వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కావాలన్నా అధిక మొత్తంలో చెల్లించుకోక తప్పదు. ఈ క్రమంలో మాన్యువల్‌ మోటార్‌ సైకిల్‌కు రూ.400, ఆటోమేటిక్‌ మోటార్‌సైకిల్‌కు రూ.500, మాన్యువల్‌ లైట్‌ వెహికిల్స్‌, త్రీ వీలర్స్‌కు రూ.800, ఇవి ఆటోమేటిక్‌ అయితే రూ.1000, మాన్యువల్‌ మీడియం వెహికిల్, ప్యాసింజర్‌ మెటార్‌ వెహికిల్‌కు రూ.800, ఇవి ఆటోమేటిక్‌ అయితే రూ.1300, మాన్యువల్‌ హెవీ వెహికిల్, ప్యాసింజర్‌ మోటార్‌ వెహికిల్‌ అయితే రూ.1000, ఇవి ఆటోమేటిక్‌ అయితే రూ.1500 ఫిట్‌నెస్‌ టెస్టు కోసం చెల్లించాలి.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రెన్యువల్‌కు మోటార్‌ సైకిల్‌కు రూ.1000, త్రీ వీలర్‌, క్వాడ్రి సైకిల్‌కు రూ.3500, లైట్‌ వెహికిల్స్‌కు రూ.7500, మీడియం గూడ్స్, ప్యాసింజర్‌ మోటార్‌ వెహికల్స్‌ అయితే రూ.10వేలు, హెవీ గూడ్స్‌, ప్యాసింజర్‌ మోటార్‌ వెహికిల్‌ అయితే రూ.12500 చార్జిలను చెల్లించాలి. ఎక్స్‌పైర్‌ అయ్యాక ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటే అదనంగా మరో రూ.50 రోజుకు చార్జి వసూలు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version