సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి.. అంత నీరు ఎక్కడ నుండి వచ్చింది??

-

భూమిమీద అసలు సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి. ఆ సముద్రాల్లోకి నీరు ఎలా వచ్చింది. మొట్టమొదటి కణం ఏర్పడిందే నీటిలో అంటారు మరి అయితే నీరు ఏర్పడి ఎన్ని ఏళ్లు అయినట్టు అనే అనేక ప్రశ్నలు మీలో తలెత్తాయి. అయితే వాటికి శాస్త్రవేత్తలు ఏం సమాధానం చెప్తున్నారో చూద్దామా..!

భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి శాస్త్రవేత్తల దగ్గర రెండు జవాబులు ఉన్నాయి. భూమి ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలు అయింది. అది ఏర్పడిన మొదట్లో భూమి అంత లావాతో నిండిపోయింది. అంత వేడి వల్ల భూమిమీద ఉన్న నీరు ఆవిరిగా మారిపోయింది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత భూమి చల్లబడి భూమి లోపలున్న నీరు అగ్నిపర్వతాలు పేలుళ్లు జరిగినపుడు ఆవిరి రూపంలో బయటకి వచ్చి మబ్బులుగా ఏర్పడి వర్షాలు పడటం వల్ల భూమి మీద నీరు ఏర్పడిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు ఈ ప్రక్రియ జరగడం వల్ల సముద్రాలు, మహా సముద్రాలు ఏర్పడ్డాయని వారు చెప్తున్నారు.

కొన్ని కోట్ల సంవత్సరాల ముందు భూమిని కొన్ని కోట్ల గ్రహశకలాలు ఢీ కొట్టాయి. ఆస్టరాయిడ్స్, కామెట్స్​లో ఉన్న నీటి మంచు గడ్డ భూమి మీద పడటం వల్ల భూమి మీద నీరు ఏర్పడిందనే వాదనలు వినిపించాయి. మొత్తం మీద భూమి మీద ఉన్న సముద్రాలు, మహా సముద్రాల్లోని నీరు కొంత భాగం భూమిలోపల నుండి రాగా కొంత భాగం గ్రహశకలాలు ఢీ కొట్టడం వల్ల ఏర్పడ్డాయి.
సముద్రలోని నీరు రెండు రకాలుగా ఉంటుంది. అందులో అధిక గాఢత కలిగిన నీరు మరియు మాములుగా నీరు అనగా అల్ప గాఢత కలిగిన నీరు ఉన్నాయి.

నీటి అణువు H2O రూపంలో ఉంటుంది. నీటి అణువులోని హైడ్రోజన్ పరమాణువులోని న్యూక్లియస్​ ఆధారంగా దాని నీటిని మాములు నీరా అధిక గాఢత కలిగిన నీరా అనేది చెప్తారు. అయితే హైడ్రోజన్​ న్యూక్లియస్​లో ఒక ప్రోటాన్ ఉంటే అది మాములు నీరని.. ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటే దాన్ని డ్యూటీరియం అంటారు. నీటిలో ఎక్కువ డ్యూటీరియం మాలిక్యూల్స్ ఉంటే దాన్ని హెవీ వాటర్ (అధిక గాఢత కలిగిన నీరు) అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version