గ్రేటర్ వరంగల్,ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల పై టీఆర్ఎస్ వ్యూహాలు

-

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది . మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు ట్రెండ్ చూశాక వరంగల్ ,ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు వెంటనే నిర్వహించి, రెండింటిని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ నాయకత్వం ముందుకు పోతోంది. ఇప్పటికే జిల్లా నాయకత్వంతో పలు సార్లు సమావేశాలు నిర్వహించిన టిఆర్ఎస్ అదిష్టానం, పకడ్బంది వ్యూహంతో ఎన్నికలకు రెడీ అవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలు తీరును పరిశీలించిన టిఆర్ఎస్ అధిష్టానం.. వెంటనే వరంగల్ , ఖమ్మం కార్పోరేషన్లకు ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించుకుంది.ఈ రెండు కార్పోరేషన్లను మరోసారి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2016లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేసింది. మొత్తం 58 డివిజన్లలో 49 డివిజన్లలో టిఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. కేవలం 9 డివిజన్లు మాత్రమే ప్రతిపక్షాలకు దక్కాయి. తొమ్మిది డివిజన్లలో కాంగ్రెస్ నాలుగు డివిజన్లలో గెలుపొందగా గెలిచిన కొద్ది రోజులకే వేముల శ్రీనివాస్ అనే కార్పోరేటర్ టిఆర్ఎస్ లోచేరారు . బీజేపీ నుంచి ఒక్కరు , సిపిఎం నుంచి ఒక్కరు గెలిచారు . సిపిఎం నుంచి గెలిచిన కార్పోరేటర్ కూడా తిరిగి అధికార టీఆర్ఎస్ లోనే చేరారు. ఒక కార్పోరేటర్ మినహా మిగిలిన 54 మంది కార్పోరేటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉన్నారు.

ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లోను గులాబీ పార్టీ సత్తా చాటేందుకు అప్పుడే ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే అభివృద్ది పనుల పై దృష్టి సారించించారు ప్రజాప్రతినిధులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగి దాదాపుగా ఐదేళ్లు కావస్తోంది . అయితే ఈ నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలపై పెద్దగా దృష్టి సారించని గులాబీ దళం చివరి ఏడాది అభివృద్ధి కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్య మంత్రి కార్పోరేషనకు ఏటా 300 కోట్ల రూపాయలను నేరుగా బడ్జెట్ నుంచి కేటాయిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం, వరుసగా మూడేళ్లపాటు 300 కోట్ల రూపాయల చొప్పున 900 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.

వాటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సిసిరోడ్లు డ్రైనేజీ పనులు , ప్రధాన రహదారులు , జంక్షన్లు దగ్గర అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా తమ డివిజన్లతో ఎక్కవ మొత్తంలో నిధులతో అభివృధ్ది పనులు చేసి డివిజన్ వాసులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు నుంచే గ్రేటర్ వరంగల్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు , జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ తో పాటు అర్బన్ ఎంఎల్‌ఎలు , ఎంఎల్సీలతో టిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించారు.కార్యకర్తలను , క్యాడర్ ను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version