ఇదేం ఏటీఎం రా నాయనా.. వెయ్యి కొడితే ఇరవై వేలు వస్తున్నాయి..

-

కొన్ని సార్లు ఏటీఎం నుంచి తక్కువ అమౌంట్‌ ఎంటర్‌ చేస్తే ఎక్కువ అమౌంట రావడాన్ని చూసే ఉంటాం. అలాంటి ఘటనే ఇది.. సిద్ధిపేటలో ఓ ఏటీఎం వద్దకు ప్రజలు పోటెత్తారు. అందుకు తగిన కారణమే ఉంది. ఆ ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే, రూ.20 వేలు బయటికొస్తున్నాయట. ఈ వార్త కొద్దిసమయంలోనే సిద్ధిపేట మొత్తం పాకిపోయింది. దాంతో ఆ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. అది బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)కి చెందిన ఏటీఎం అని వెల్లడైంది. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటికొస్తోందన్న నేపథ్యంలో, బ్యాంకు అధికారులు ఈ సమాచారం అందింది. వెంటనే స్పందించిన బీవోఐ అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. అధికారులు ఆ ఏటీఎంను పరిశీలిస్తున్నారు. ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version