టీ20 వరల్డ్ కప్‌లో జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. అయితే నేడు టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అస్ట్రేలియాతో శ్రీలంక
తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసిస్ బౌలింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్
ముగిసింది. శ్రీలంక జట్టు వేగంగా ఆడలేక కుశాల్ మెండిస్ (5) విఫలమవగా.. పాథుమ్ నిస్సంక (40) వన్డే తరహాలో ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వ (26) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు.
చరిత్ ఆసలంక (38 నాటౌట్) ధాటిగా ఆడగా.. అతనికి భానుక రాజపక్స (7), దాసున్ షనక (3), వానిందు హసరంగ (1) ఏమాత్రం సహకారం అందించలేకపోయారు. చివర్లో చమిక కరుణరత్నే (7 బంతుల్లో 14 నాటౌట్) కూడా బ్యాటు ఝుళిపించడంతో శ్రీలంక జట్టు పోరాడగలిగే స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆస్టన్ అగర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసుకున్నారు.