భారీగా కరోనా ఉగ్రవాదులు దేశంలోకి…!

-

ఒక పక్క దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నా సరే పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. దేశంలో జనాభా రోజు రోజుకి చనిపోతున్నా ఆ దేశం మాత్రం తన పన్నాగాలను మార్చుకోవడం లేదు. అక్కడ పది వేలు దాటాయి కరోనా కేసులు. ఈ తరుణంలో దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన పాకిస్తాన్ ఇప్పుడు మన దేశంలో కరోనా ఉన్న వ్యక్తులను పంపాలి అని భావిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పుడు కరోనా రోగులు ఎక్కువగా ఉన్నారు.

పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన కీలక అధికారులు కొందరు వారిని ప్రత్యేకంగా దాచి పెట్టి అవసరం అనుకున్న సమయంలో కొండ ప్రాంతాల నుంచి పంపాలి అని భావిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వారిని పంపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వార్తలను జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ డిల్బాగ్ సింగ్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఖరారు చేసారు.

‘పాక్ ఇంతవరకూ ఉగ్రవాదులను ఆయుధంగా చేసుకోవడమే మనకు తెలుసని వ్యాఖ్యానించిన ఆయన… ఇప్పుడు కరోనా పాజిటివ్ వ్యక్తులను కశ్మీర్‌లోకి చొప్పించాలనుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల నేపాల్ సరిహద్దుల్లో భారీగా ఉగ్రవాదులు మన దేశంలోకి అడుగు పెట్టారు అనే ప్రచారం జరిగింది. దీనితో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version