కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీ ఆస్తి నష్టం ?

-

హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు టెన్షన్ కలిగిస్తున్నాయి. ఒక పక్క దీపావళి సంబరాలు అంబరాన్ని అంటిన వేళ హైదరాబాద్ కూకట్ పల్లి లోని ఒక హార్డ్వేర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లోని రాందేవ్ ఎలక్ట్రికల్స్ అనే ఒక హార్డ్వేర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ షాప్ కిందనే సి ఎం ఆర్ జువెలరీ షాపు కూడా ఉండడంతో భారీగా ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అగ్ని ప్రమాదం సంభవించిన షాప్ కి పక్కనే బట్టల షోరూమ్ లు, మరో పక్క జాయలుక్కాస్ బంగారం షో రూమ్ ఉండడంతో మంటలను అదుపు చేసేందుకు భారీ ఎత్తున ఫైర్ సిబ్బందిని మోహరించారు. అయితే ఇంకా మంటలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్న ట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version