కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి స్మగ్లింగ్‌కు దిగుతున్నారు.. కానీ.. అధికారుల తనిఖీల్లో దొరికి జైల్లో ఉచలు లెక్కపెతున్నారు. అయితే.. గత కొన్ని నెలలుగా ఎయిర్‌పోర్టుల్లో భారీగా స్మగ్లింగ్ వస్తువులు దొరుకుతున్నాయి. అయితే.. తాజాగా.. బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే… భారత్‌కు చెందిన నహిత్ సుల్తాన, అర్గన్స్ బేగం కలిసి ఈ నెల 12న దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దుబాయ్ నుంచి అనధికారికంగా తీసుకువచ్చిన బంగారాన్ని తమ లగేజి బ్యాగుల్లో పెట్టుకుని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో.. ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వారి వద్ద రూ.74,02,500 విలువ చేసే 1410 గ్రాముల బంగారం లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.