క్షుద్రపూజల ఘటనలు కేరళలో కలకలం రేపుతున్నాయి. నిన్నటి నిన్న కేరళలోని పథనంతిట్టలో మరో నలబలి ఘటన మరిచిపోకముందే మరో క్షుద్రపూజల ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మంత్రగత్తె క్షుద్రపూజలకు చిన్నపిల్లలను ఉపయోగిస్తున్నట్లు స్థానికులు గుర్తించి ఆందోళనకు దిగారు. ఆ మంత్రగత్తెను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు స్థానికులు. దీంతో మంత్రగెత్తెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పథనంతిట్ట జిల్లాలోని మలయాళపూజ పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్రపూజలు చేస్తూ వుంటుందని స్థానికులు చెప్పారు. చిన్న పిల్లల్ని తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తూ వుంటుందని అంటున్నారు స్థానికులు. క్షుద్రపూజల్లో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయింది. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మంత్రగత్తెను అరెస్ట్ చేశారు పోలీసులు.
కాగా… కేరళ నరబలి ఘటనతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఘటనలో విషయాలు మనిషి నాగరికతనే ప్రశ్నించేలా ఉన్నాయి. సిరి సంపదలు వస్తాయని నరబలికి దంపతులు అంగీకరించడం, మనిషి బాడీ పార్టులను ఉడికించుకుని తింటే యవ్వనులుగానే ఉంటారనే మాటలు విశ్వసించారంటే వారి ఆలోచన ప్రగతి ఎక్కడ గడ్డకట్టుకుపోయిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. విషయాలు వెలుగులోకి వచ్చినకొద్దీ ఈ ఎపిసోడ్ మరింత క్రూరంగా కనిపిస్తున్నది. ఇద్దరు మహిళలను మూఢ నమ్మకాలతో అత్యంత దారుణంగా హతమార్చడమే కాదు.. అవే గుడ్డి నమ్మకాలతో సొంత భార్య పైనే అత్యాచారానికి భర్త అంగీకరించాడు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.