ఉప్పల్ స్టేడియంలో రేపటి మ్యాచ్ కు భారీ బందోబస్తు

-

భారత్ – న్యూజిలాండ్ జెట్ల మధ్య వన్డే సిరీస్ రేపటి నుండి ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ఎరిజట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. మరి కొద్ది గంటల్లో ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలించారు రాచకొండ సీపీ చౌహన్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి మ్యాచ్ కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సమస్య, ఇబ్బంది కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఎంట్రీ- ఎక్స్జిట్ బోర్డులు ఈ సారి పెట్టామని.. ప్లేయర్స్ ఎంట్రీ గేట్ నుంచి బయట వ్యక్తులకు ఎవరికి ఎంట్రీ లేదన్నారు.

ప్లేయర్స్ కు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రౌండ్ లోకి ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మహిళల కోసం ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు ఉన్నాయని.. అమ్మాయిల పట్ల ఎవరైనా దురుసు ప్రవర్తన చేస్తే చర్యలు తప్పవన్నారు. రెండు వేల మందికి పైగా పోలీసు సిబ్బంది డ్యూటీ లో ఉంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version