నేటి నుంచి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు

-

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలను తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటికే 150 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసిన ఆయన.. ఇవాళ్టి నుంచి మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నారు. ఇవాళ 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇన్‌ఛార్జుల పనితీరుపై సమీక్షించనున్నారు.

రాజోలు,శ్రీకాకుళం, పాతపట్నం, పలాస,భీమవరం, గంగాధర నెల్లూరు, కడప, సూళ్లూరుపేట, నంద్యాల నియోజకవర్గాల్లో పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొందరికి ఈ సమీక్షలలో క్లాస్ పీకే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించని నియోజకవర్గ ఇన్చార్జిలను మారుస్తానని చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version