హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో భారీ ఊరట..

-

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో భారీ ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు… జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఊపారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం హైదరాబాద్‌ జర్నలిస్టులు పోరాడుతున్నారు.

Indian Supreme Court

జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో ఇవాళ విచారణ జరిగింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ…జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు.

ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు సీజేఐ. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదని.. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నామని.. వారి స్థలంలో నిర్మాణాలు కూడా జరుపుకోవచ్చని ప్రకటించారు సీజేఐ. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version