షాకింగ్..హీరో సుమన్ భార్య బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

-

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి గ్రాండ్ సక్సెస్ అయినవారిలో ఒకరు హీరో సుమన్..ఒకప్పుడు ఈయన పట్టిందల్లా బంగారం లాగ ఉండేది..మెగాస్టార్ చిరంజీవి తో బాలయ్య బాబు లాంటి వారే పోటీ పడడానికి కష్టపడుతున్న రోజుల్లో హీరో సుమన్ చిరంజీవి కి దీటుగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ నెంబర్ 1 హీరో నువ్వా నేనా అనే రేంజ్ లో చిరంజీవి కి పోటీ ని ఇచ్చేవాడు.

అంతటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఈయన..సుమన్ గారు చిరంజీవి లాగానే డాన్స్ వెయ్యగలడు..అద్భుతంగా నటించగలడు..ఇక ఫైట్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కరాటే లో బ్లాక్ బెల్ట్ సాధించిన వాడు ఈయన..సినిమాల్లోకి రాకముందు ఈయన కరాటే టీచర్ గా కూడా కొన్ని స్కూల్స్ లో పని చేసాడు..అలా వెండితెర మీద ఈయన చేసే పోరాట సన్నివేశాలకు ప్రేక్షకులు థియేటర్స్ లో విజిల్స్ వేసేవారు..అంతలా ఇండస్ట్రీ దూసుపోతున్న సుమన్ కెరీర్ జైలు పాలైంది..బ్లూ ఫిలిమ్స్ తీస్తున్నాడు అనే కేసు లో సుమన్ ని ఎవరో కావాలని ఇరికించి ఆయన జీవితాన్ని నాశనం అయ్యేలా చేసారు.

ఈ కేసు దెబ్బకి  దాదాపుగా 5 ఏళ్ళ పాటు ఆయన సినిమాల్లో కనిపించలేదు..ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి హీరో గా సినిమాలు చేసినప్పటికీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి..సుమన్ కి ఏర్పడిన నెగటివ్ ఇమేజి వల్లే ఆయన సినిమాలను జనాలు చూడడం మానేశారని అప్పట్లో అనుకునేవారు..ఇక మెల్లగా సుమన్ ని హీరో గా పెట్టి సినిమాలు తియ్యడానికి ఏ దర్శక నిర్మాత కూడా ఆసక్తి చూపించలేదు..దానితో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టు గా మారాడు..క్యారక్టర్ ఆర్టిస్టు గా మారిన తర్వాత సుమన్ కి మంచి అవకాశాలు వచ్చాయి..అలాగే పలు సినిమాల్లో ఆయన విలన్ గా కూడా నటించాడు..అలా సుమన్ సౌత్ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు..ఇప్పటికి ఆయన చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గానే గడుపుతున్నాడు..ఇది పక్కన పెడితే సుమన్ వ్యక్తిగత విషయాలలో ఆయన జైలుకు వెళ్లిన సంగతి తప్ప మనకి ఏమి తెలిసి ఉండదు..ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి..ఆయన జీవిత భాగస్వామి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

సుమన్ గారు ప్రముఖ టాలీవుడ్ రచయిత నర్సరాజు గారి మానమరాలిని పెళ్లాడాడు..నరసరాజు గారు అప్పట్లో ఎన్టీఆర్ మరియు ANR వంటి హీరోలతో ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలు మరియు మాటలు అందించాడు..ఆయన రచన లో వచ్చిన గుండమ్మ కథ చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వస్తే నేటి తరం ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపొయ్యి చూస్తారు..అలాంటి బ్లాక్ బస్టర్ క్లాసిక్  చిత్రాలకు రచయితగా పనిచేసిన నరసరాజు గారి మనవరాలు శిరీష ని పెళ్లాడాడు సుమన్..వీరిది ప్రేమ వివాహమే..ఈ ఇద్దరి దంపతులకు అభిలజ ప్రత్యూక్ష అనే కూతురు ఉంది.

ఈమె గొప్ప నృత్య కళాకారిణి..రవీంద్ర భారతి లో ఈమె ఎన్నో నృత్య ప్రదర్శనలు చేసింది..తండ్రి ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు అయ్యినప్పటికీ కూడా ఈమె తన తండ్రి పేరు వాడుకొని సినిమాల్లోకి రావాలనుకోలేదు..ఎందుకంటే ఆమెకి సినిమాల మీద ఎలాంటి ఆసక్తి లేదట..చూసేందుకు కుందనపు బొమ్మలాగా ఎంతో అందం గా కనిపిస్తున్న అభిలజ ప్రత్యూక్ష హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు..ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చి ఉంటె సౌత్ ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగి ఉండేది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version