ఖమ్మంలో జిల్లాలో నడిరోడ్డుపై భారీ కొండచిలువ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యింది. దీంతో వాహనదారులు ఒక్క క్షణం అలాగే నిలిచిపోయారు.ఈ ఘటన ఖమ్మం రూరల్ మండల కేంద్రంలోని కరుణగిరి బైపాస్ రోడ్డు వద్ద గురువారం రాత్రి వెలుగుచూసింది.
రోడ్డు మీద నుంచి నెమ్మదిగా కొండచిలువ వెళ్తుండటం గమనించిన వాహనదారులు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయి అది వెళ్లిపోయే వరకు రోడ్డు దాటి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది.కొండచిలువ రోడ్డు దాటుతుండగా వాహనాలను నిలిపివేసి.. దానికి ఎలాంటి హాని జరగకుండా రోడ్డు దాటే వరకు చూసి వెళ్లిపోయారు.దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.