త్వరపడండి: HDFC బ్యాంకు కస్టమర్స్ కు బంపర్ ఆఫర్..

-

పండుగ వస్తుంది అంటే చాలు.రకరకాల ఆఫర్లతో షాపులు కళకళ లాడిపోతుంటాయి. కొత్త వస్తువులు కొనాలి అనుకునే వారు పండగ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే కొంత అయిన మనీ సేవ్ అవుతాయని ఆలోచిస్తారు. అయితే ఈ పండగకి ఇప్పటికే కొన్ని కంపెనీస్ ఆఫర్ల మీద ఆఫర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ కంపనీలు పోటాపోటి డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్ ‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు ఈ పండుగ వాతావరణాన్ని ఇంకాస్త ఆనందంగా మార్చేందుకు కొన్ని రకాల బ్యాంకులు కూడా సరికొత్త ఆఫర్లు అందిస్తున్నాయి.

ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా.. పండుగకు మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటే మీకు ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. అది ఏంటంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కారు లోన్‌ పై పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు కళ్ళు చెదిరే కార్ లోన్ ఆఫర్ అందిస్తోంది. కార్ లోన్ కావాలనుకునే వారికి అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. కారు లోన్ తీసుకునే వారికి ఒక రూ.లక్షకు రూ.1,111 నుంచి ఈఎంఐ ప్రారంభమౌతోంది. అంతేకాకుండా, కారు లోన్ తీసుకునే వారు మరిన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. కారో లోన్‌పై ఎటువంటి చార్జీలు ఉండవు కూడా. జీరో ఫోర్ ‌క్లోజర్ చార్జీల బెనిఫిట్ కూడా ఉంది. అంటే మీరు లోన్ మొత్తాన్ని అనుకున్న సమయానికంటే ముందే తీర్చేసినా కూడా ఎలాంటి అదనపు చార్జీలు అనేవి ఉండవు అన్నమాట. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే… మీకు కార్ లోన్ కావాలంటే రోజుల తరబడి బ్యాంకు చుట్టూ తిరగవలిసిన పనిలేదు. కేవలం 10 సెకన్లలోనే మీరు లోన్ పొందవచ్చు. కానీ, ఇది ప్రిఅప్రూర్డ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇకపొతే కార్ లోన్ మీద వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి.

వేతన జీవులు 7.9 శాతం ప్రారంభ వడ్డీతో లోన్ పొందొచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్ లోన్ ఆఫర్ నవంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు మీ దగ్గరిలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి లోన్ వివరాలు తెలుసుకోవచ్చు. ఋణం కావాలంటే అక్కడే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అది ఏంటంటే.. రుణం కావాలనుకునే వారు ఆన్‌లైన్‌ లో కూడా లోన్‌ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. కార్ లోన్‌ పై క్లిక్ చేసి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.. త్వరపడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version