మచిలీపట్నంలో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

-

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్తలు ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రగాయాలైనట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్నం టౌన్‌లోని నిజాంపేట ఏరియాకు చెందిన దంపతులు వాసవి – ఉప్పాల గోపీకృష్ణ మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి.

కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపం చెందిన వాసవి ముందుగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.అనంతరం భర్త గోపీకృష్ణ సైతం రైలుకు ఎదురెళ్లినట్లు సమాచారం. ఆయనకు తీవ్రగాయాలవ్వగా.. రైల్వే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వాసవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news