వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను.. కట్టుకున్న భార్య కిరాయి మనుషులతో దారుణంగా హత్య చేయించింది.ఈ ఘటన బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం, దామరంచ శివారులో నాగారం గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. అమృతం విట్టల్, అమృతం కాశమని భార్యభర్తలు. అయితే, గత కొంతకాలంగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం నడిపిస్తున్న కాశమ్మ.. భర్త అడ్డు వస్తున్నాడని డబ్బులు ఇచ్చి మరీ హత్యచేయించిందని మృతుడి తమ్ముడు సాయిలు ఆరోపించాడు. మృతుడు సోమేశ్వర గ్రామం నుంచి నాగారం గ్రామంలోని తన మేనమామ ఇంటికి ఇల్లరికం వెళ్లినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మృతుని భార్య అమృతం కాశమని,మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.