ఫెషియల్ చేయించుకుందని భార్య జుట్టు కట్ చేసిన భర్త.. వీడియో

-

ఫెషియల్ చేయించుకుందని ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా భార్య జుట్టును కత్తిరించాడు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హర్ధోయ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. యూపీ వాసి రాం ప్రతాప్ తన భార్య బ్యూటీపార్లర్‌లో ఫెషియల్‌ చేయించుకుందని ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో భర్త రాంప్రసాద్ ఆమెపై దాడి చేయడమే గాక అత్తమామల ముందే భార్య జుట్టును కత్తితో కోసి వెళ్లిపోయాడు.బాధితురాలి తల్లిదండ్రులు రాం ప్రతాప్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన అల్లుడు అదనపు కట్నం కోసం కూతురును వేధిస్తున్నాడని, ఇందులో భాగంగానే తమ కూతురితో కావాలని గొడవకు దిగి ఆమె జుట్టు కత్తిరించాడని ఆరోపించారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news