టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను లావణ్య అనే యువతి బ్లాక్ మెయిల్ చేసిందని రాజ్ తరుణ్.. ఆయనే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఇలా మొన్నటివరకు ఎపిసోడ్స్ నడిచాయి. రాజ్ తరుణ్ వేరే యువతితో ఉంటున్నాడని.. అతని పేరెంట్స్ మీద కూడా లావణ్య కేసు పెట్టింది.
తీరా చూస్తే ప్రస్తుతం లావణ్య-రాజ్ తరుణ్ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రెండ్రోజుల కిందట రాజ్ పేరెంట్స్ వారి ఇంటికి వచ్చి తాము కూడా మీతోనే ఉంటామని, కొంతమంది వ్యక్తులతో వచ్చి బెదిరించామని ఆమె మళ్లీ పోలీస్ స్టేషన్ గడపతొక్కింది. ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతుండగానే.. మరో సంచలన వీడియోను లావణ్య రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య- రాజ్ తరుణ్ ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు ఉంది. ఇద్దరూ నవ్వుతూ కనిపించారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఇది పాత వీడియోనా, కొత్తదా అనేది తెలియాల్సి ఉంది.\
సంచలన వీడియో రిలీజ్ చేసిన లావణ్య
తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన రాజ్ తరుణ్- లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్. లావణ్య సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల వద్ద లావణ్య రాజ్ తరుణ్ ఆశీర్వాదం… https://t.co/DKVItXtbb6 pic.twitter.com/XIea7BBeCL
— ChotaNews App (@ChotaNewsApp) April 20, 2025