హుజూరాబాద్ అప్డేట్: 15వ రౌండ్ లో ఈటెల రాజేందర్ కు భారీ ఆధిక్యం

-

హుజూరాబాద్ ఎన్నికల్లో దాాదాపుగా విజయం ఖరారవుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రౌండ్ రౌండ్ కు ఆధిక్యతను చాటుతున్నారు. ఇప్పటికి జరిగిన 15 రౌండ్లలో 13 రౌండ్లలో బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ కన్నా ఆధిక్యం లభించింది. కేవలం రెండు రౌండ్లలోనే టీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించింది. తాజాగా ముగిసిన 15 వ రౌండ్ లో కూడా బీజేపీ భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్ల కన్నా అధిక లీడ్ సంపాదించింది. 2149 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. మొత్తంగా అన్ని రౌండ్లు కలుపుకుని 11583 ఓట్ల మెజారిటీని సాధించింది. ఇప్పటి వరకు బీజేపీకి 63079 ఓట్లు లభించగా… టీఆర్ఎస్ కు 53645 ఓట్లు లభించాయి.

10 నుంచి 16 రౌండ్ వరకు జమ్మికుంట మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాలు ఉన్నాయి. జమ్మికుంట మండల వ్యాప్తంగా బీజేపీకి లీడ్ లభించింది. ప్రస్తుతానికి హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట మండలాల్లోని ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇందులో కమలాపూర్ ఈటెల సోంత మండలం. ఈమండలంలో బీజేపీకి అధిక ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version