సిద్ధిపేట కలెక్టర్‌ కు తెలంగాణ హై కోర్ట్ వార్నింగ్

-

సిద్ధిపేట కలెక్టర్‌ వెంకటరామిరెడ్డి కి తెలంగాణ హై కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. యాసంగి వరి విత్తనాల అమ్మకాల పై సిద్దిపేట కలెక్టర్ చేసిన వాక్యాల పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించారు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్. వరి విత్తనాలు అమ్మకూదని సిద్దిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు పిటీషనర్.

సిద్దిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులు గా చేర్చారు పిటిషనర్. వరి విత్తనాల అమ్మకాల ను ప్రొహిభీషన్ యాక్ట్ లో ఏమైనా చేర్చరా అని తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించింది హైకోర్టు.

అలాంటిది ఏమి లేదని కోర్టుకు తెలిపిన ఏజి బీఎస్ ప్రసాద్.. అలాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదని ఇకపై కూడా తీసుకోబోదని హామీ ఇచ్చారు. రైతుల విషయం లో కలెక్టర్ ఎలా వాక్యాలు చేస్తారని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై వార్నింగ్ కూడా ఇచ్చింది హై కోర్టు. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందన్న హైకోర్టు.. ఈ పిటీషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేయాలని రీజిస్టార్ కు అదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version