బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు మంచి గుణపాఠం నేర్పించారని అన్నారు. హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడు. ధర్నా చౌక్ లో ధర్నా చేసేలా హుజూరాబాద్ ప్రజలు చేశారు. 7 ఏళ్ల కాలంలో ప్రజల్లో చైతన్యాన్న చంపేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. ఏడేళ్ల కాలంలో పలు సంఘాలను నిర్వీర్యం చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 24 గంటలు కరెంట్ ఇచ్చి, ఉచిత నీటిని ఇచ్చి, రైతుబంధు ఇచ్చ వరిని సాగు చేయద్దంటున్నారు. వరి వేస్తే ఉరి అంటూ.. వరి వేస్తే రైతుబంధు ఇవ్వమంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రైతు మీద కేసీఆర్ కు ప్రేమ లేదని అన్నారు.
హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు- ఈటెల రాజేందర్
-