కే‌సి‌ఆర్ ఇలా దొరికిపోయారేంటి? కరెక్ట్ టైమ్‌లో ‘కారు’కు డ్యామేజ్?

-

ఏదో అనుకుంటే ఏదో అయినట్లుగా…దళితబంధు పేరిట లక్షల రూపాయిలు దళితులకు పంచి వారి ఓట్లు కొల్లగొట్టాలని సి‌ఎం కే‌సి‌ఆర్ బాగానే ఎత్తు వేశారు. కేవలం హుజూరాబాద్ ఉప పోరులో ఈటల రాజేందర్‌ని ఓడించాలని చెప్పి, కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా దళితబంధు తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వడానికి స్కెచ్ వేశారు. అసలు పది లక్షలు ఇస్తే…ఆ కుటుంబాలు కేవలం టి‌ఆర్‌ఎస్‌కే ఓటు వేస్తారని, హుజూరాబాద్‌లో దళిత ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, తమకు బాగా ప్లస్ అవుతుందని కే‌సి‌ఆర్ భావించారు.

KCR-TRS

కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది…దళితబంధు వల్ల బీసీల్లో అసంతృప్తి వచ్చింది. సరే వారి అసంతృప్తిని తగ్గించాలని కే‌సి‌ఆర్ ప్రయత్నించారు. అయితే దళిత బంధు వల్ల…కొంత దళితులు టి‌ఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారని సర్వేలు కూడా చెప్పాయి. దీంతో టి‌ఆర్‌ఎస్‌కు అడ్వాంటేజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ట్విస్ట్‌లో అసలు విషయం బయటపడింది. నియోజకవర్గ పరిధిలో అన్ని రూపాల్లోనూ దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఉపఎన్నిక తర్వాత పథకం అమలు చేసుకోవచ్చని చెప్పింది. అయితే పథకం పెండింగ్‌లో పడటం ఒక ఎత్తు అయితే, పథకం పేరిట వేసిన డబ్బులని ఫ్రీజ్ చేయడం మరొక ఎత్తు. హుజూరాబాద్‌లో మొత్తం 20,929 దళిత కుటుంబాలు ఉండగా.. ఇప్పటికే మొదటి విడతగా 18 వేల మంది బ్యాంకు ఖాతాల్లోడబ్బు పడింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశారు. రూ.10 వేలను రక్షణ నిధికి కేటాయించారు.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రూ.9.90 లక్షల నిధులను వినియోగించుకోకుండా ఫ్రీజింగ్‌ విధించారు. అయితే దళితుల ఏ వ్యాపారాలు చేసుకుంటారో, వాటికి సంబంధించి అధికారులు సర్వే చేసి, రిపోర్టులు తయారుచేసి, వ్యాపారాలకు పర్మిషన్లు వచ్చాకే బ్యాంకులు ఆ నిధులు విడుదల చేస్తాయి. అంటే ఈ ప్రక్రియ అంతా ఎప్పటికీ ముగుస్తుందో క్లారిటీ లేదు. దీనిపై దళితులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రభావం హుజూరాబాద్ ఉపఎన్నికపై పడి కారుకు డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version