బద్వేలు ఉపఎన్నిక ఫలితం వచ్చేసింది…అంతా అనుకున్నట్లే బద్వేలులో అధికార వైసీపీ భారీ విజయాన్ని దక్కించుకుంది. వైసీపీ 90,089 ఓట్ల మెజారిటీ విజయం సాధించింది. వైసీపీకి 1,11,710 ఓట్లు ,బీజేపీ 21,621 ఓట్లు, కాంగ్రెస్ 5968 ఓట్లు సాధించాయి. అయితే ఈ లెక్కలు 11వ రౌండ్ వరకే…చివరి రౌండ్ అయిన 12వ రౌండ్‌లో కూడా వైసీపీనే ఆధిక్యం సాధించడం ఖాయం. ఇక ఈలోపే గెలుపు డిసైడ్ అయిపోయింది.
ఇలా టీడీపీ…బీజేపీకి సహకరించడంతో…టీడీపీలో ఉన్న దళిత ఓటర్లు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీకి భారీ మెజారిటీ దక్కింది. టీడీపీ సహకరించినా సరే బీజేపీకి 21 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అటు కాంగ్రెస్‌కు దాదాపు 6 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే ఇక్కడ పరోక్షంగా నష్టపోయింది టీడీపీనే. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి 95 వేల ఓట్లు రాగా, టీడీపీకి 50 వేల ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీకి కేవలం 735 ఓట్లు, కాంగ్రెస్‌కు 2337 ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు బీజీపీకి పడిన ఓట్లు టీడీపీవే అని అర్ధమవుతుంది. అటు కొందరు కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపారని తెలుస్తోంది. కానీ బీజేపీకి సహకరించడంతో కొంత టీడీపీ ఓటర్లు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. అంటే మొత్తానికి చూసుకుంటే బద్వేలులో వైసీపీ భారీ విజయం సాధిస్తే…పరోక్షంగా టీడీపీ చిత్తు అయిందనే చెప్పాలి. కాస్త బీజేపీకే ప్లస్ అయినట్లు ఉంది.